Wednesday, February 5, 2025
More
    HomeTagsతెలంగాణ

    Topic: తెలంగాణ

    Telangana tops in resolution of public complaints..CP submits village petition.

    ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. గతంలోనూ అద్భుత పనితీరును నమోదుచేసిన తెలంగాణ తాజాగా మే నెలలోనూ ఉత్తమ ప్రదర్శనను కనబరిచింది. రాష్ట్రం 2,524 పిటిషన్లను అత్యల్పంగా ఎనిమిది రోజుల్లోనే పరిష్కరించింది. లక్షద్వీప్‌ 12 రోజుల వ్యవధిలో 171 పిటిషన్లను పరిష్కరించి రెండోస్థానంలో ఉండగా, అండమాన్‌ నికోబార్‌ 442 పిటిషన్లను 20 రోజుల సగటుతో పరిష్కరించి మూడోస్థానంలో నిలిచింది.

    Amit Shah behind the scenes

    ఖమ్మంలో సభపెట్టి హడావుడి చేద్దామనుకున్న బీజేపీకి సీన్‌ రివర్స్‌ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి ఏకంగా తన సభను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి అమిత్‌ షా వచ్చి తెలంగాణలో ప్రళయం సృష్టిస్తారనే స్థాయిలో బీజేపీ ప్రచారం చేసుకొన్నది. కానీ సభకు ఒకరోజు ముందే ఆయన పీఛేముడ్‌ అనడంతో రాష్ట్ర నేతలకు దిక్కు తోచడం లేదు. ఈ దుస్థితికి అనేక కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

    NCP Maharashtra Deputy Chairman Moves to BJP

    పరివర్తన చెందిన భారతదేశంతో మాత్రమే రైతులు, దళిత, బహుజన, ఆదివాసీలు సహా సకల జనుల కష్టాలు తొలగిపోతాయని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సంప్రదాయ పార్టీలు చిత్తశుద్ధిలేని కార్యాచరణతో మూసపద్ధతితో కూడిన పాలనారీతులు కొనసాగించినన్నాళ్లూ భారత్‌ అభివృద్ధి చెందదని చెప్పారు. మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి బుధవారం చేరికలు కొనసాగాయి.

    DC Venkatrami Reddy Arrested

    బ్యాంకులను మోసం చేసిన కేసులో డెకన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు టీ వెంకట్రామ్‌రెడ్డి, పీకే అయ్యర్‌, వారి స్టాట్యూటరీ ఆడిటర్‌ మణి ఊమెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. కెనరా బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకొన్నారు.

    IT Strikes.. Political Parties Affected

    ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నా ఇంటిపై ఐటీ దాడులు చేయించింది. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈజ్‌ ఫ్యూర్‌ వైట్‌ పేపర్‌' అని మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

    CS Shanti Kumari | Land worship for new Panchayat in Palli Pagrathi festival

    CS Shanti Kumari | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. దశాబ్ది ఉత్సవాలపై కలెక్టర్లతో సీఎస్‌ బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

    Minister Srinivas Yadav | “I am going to the government hospital,” says Minister Talasani.

    Minister Srinivas Yadav | ఉమ్మడి పాలనలో సరైన సౌకర్యాలు లేక, సిబ్బంది లేక ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పరిస్థితులు ఉండేవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గుర్తు చేశారు. నేడు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా దవాఖానాలను తీర్చిదిద్దిందని.. అన్ని రకాల పరీక్షలు, ఆపరేషన్లు చేస్తుండడంతో ‘నేను పోత సర్కారు దవాఖానకు’ అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.

    Subscribe

    3,565FansLike
    179FollowersFollow
    1,202FollowersFollow
    965SubscribersSubscribe

    Must read